Instresing facts about Samgameshwaram temple in Kurnool DT. - Kurnool City

Breaking

Welcome to Kurnool City

Friday, 24 November 2017

Instresing facts about Samgameshwaram temple in Kurnool DT.

No automatic alt text available.సప్త నదుల సంగమం, సంగమేశ్వర స్వామి ఆలయ అసాధారణ విశిష్టత 
ఈ ఆలయం ఏడాదికి 7 నెలలు నీటిలోనే మునిగి పోయి ఉంటుంది.

సాధారణంగా ఒక పుణ్యక్షేత్రానికి 1 లేద 2 లేద,3 నదులు ఉండే అవకాశం ఉంటుంది కాని...
కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వర ఆలయం కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలాపహారిణి, భీమరతి, భవనాశిని ఈ 7 పవిత్ర నదుల సంగమ సమీపంలో ఉండడం అతి గొప్ప విశేషం.
ఇది సప్త నదుల సంగమం జరిగే ప్రదేశం,


Image result for sangameshwara temple

త్రిమూర్తులలో మాత్రమే కాదు హైందవ సంస్కృతిలో పరమ శివుడినే దేవుళ్ళల్లో అత్యంత శక్తివంతమైన భగవంతునిగా పరిగణిస్తారు. సృష్టికి ప్రతి సృష్టి చేయగల శక్తి, నిర్విఘ్నంగా 1000 సంవత్సరాల పాటు ధ్యానంలో ఉండగల ఏకాగ్రత, విశ్వాన్నంతటిని తన కనుసైగతో భస్మీపటలం చేసేంతటి క్రోధం ఆ పరమశివునిలో అంతర్భాగమై ఉన్నాయనంటారు..

ఇదే ప్రాంతంలో నదులకు మళ్ళే ఈ ప్రాంతంలో ఒకే దేవాలయం కాదు సోమేశ్వరం, సిద్దేశ్వరం, మల్లేశ్వరం, కపిలేశ్వరం కోవెలలు కూడా ఇదే ప్రాంతంలో నిర్మితమై ఉన్నాయి. దీనికో చరిత్ర కూడా ఉంది. ద్వాపరియుగంలో సంగమేశ్వర ఆలయంలో లింగాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉంటాయని శ్రీ కృష్ణుడు చెప్పాడట.. ధర్మరాజు మొదట వేపలింగాన్ని ఇక్కడ ప్రతిష్టించారట, తనకోసం ఎదురుచూడకుండా వేప లింగాన్ని ప్రతిష్టించారని చెప్పి కోపంతో తాను కాశి నుంచి తీసుకువచ్చిన ఐదు శివ లింగాలను భీముడు విసిరి పారేశారట ఆ తర్వాతి కాలంలో అవ్వి కూడా దేవాలయాలుగా వెలిశాయి.Related image

ఈ ఆలయాలలో కొన్ని నీటిలో మునిగిపోతాయి. ఒకసారి సంగమేశ్వర ఆలయం కూడా నీటి తాకిడి ఎదుర్కున్నా కాని వాటిని పటిష్టింగా నిర్మించి నిన్నటి చరిత్రను భవిషత్తుకు అందజేస్తున్నారు. ఈ ఆలయ ఆకారం ఒక రథంలా పోలి ఉంటుంది. పూర్వం పార్వతి పరమేశ్వరులు ఈ రథం(ఆలయం) మీద ఆసీనులై విహారయాత్రకు వెళ్ళేవారని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత గర్భగుడిలో ఉన్న లింగ ప్రతిమ మీద పూజారుల ప్రతిబింబాలు కనిపిస్తాయి దీని వల్ల కూడా ఈ కోవెలను రూపాల సంగమేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు.

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here