కర్నూల్ లో దారుణం !! ప్రియుడు కోసం, 2 lakhs సుపారీ ఇచ్చి భర్తను చంపించి ఓ మహిళా !! - Kurnool City

Breaking

Welcome to Kurnool City

Saturday, 16 December 2017

కర్నూల్ లో దారుణం !! ప్రియుడు కోసం, 2 lakhs సుపారీ ఇచ్చి భర్తను చంపించి ఓ మహిళా !!

wfwf
కర్నూలు జిల్లా  ఓర్వకల్లు మండలం  చెందిన వడ్డే చిన్నమద్దిలేటి (29) హత్య కేసు మిస్టరీకి పోలీసులు తెరదించారు.
అదే గ్రామానికి చెందిన హతుడి భార్య వెంకటేశ్వరమ్మ23,ఈమె ప్రియుడు మాబాషా 29.ఈ హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.
చిన్నమద్దిలేటికి తన మేనకోడలైన వెంకటేశ్వరమ్మతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు,కుమార్తె ఉన్నారు.
భర్తతో కాపురం చేయడం ఇష్టంలేని ఈమె ట్రాక్టర్‌ డ్రైవర్‌ మాబాషాతో రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
విషయం అందరికీ తెలియడంతో పలుమార్లు పెద్దల ఎదుట పంచాయితీ జరిగింది.ఈ క్రమంలో చిన్నమద్దిలేటిని హత్య చేసి అడ్డు తొలగించుకోవాలని వీరిద్దరూ నిర్ణయించారు.
అతడిని హత్య చేసే బాధ్యతను ట్రాక్టర్‌ డ్రైవరు వాడాల మనోహర్‌కు అప్పగించి రూ.లక్ష సుపారీకి ఒప్పందం కుదుర్చుకున్నారు.
కుట్రలో భాగంగా మనోహర్‌ చిన్నమద్దిలేటితో పరిచయం చేసుకొని స్నేహం చేస్తున్నట్లు నటించాడు.హతుడికి మద్యం తాగించారు మద్యం మత్తులో నిద్రిస్తున్న చిన్నమద్దిలేటి తలపై రాయితో మోది చంపారు.
మరుసటిరోజు ఈ విషయం వెలుగు చూడటంతో ఓర్వకల్లు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నాగరాజుయాదవ్‌ కేసు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేసి చరవాణులు,మోటారుసైకిల్‌ స్వాధీనం చేసుకున్నారు.
శుక్రవారం సాయంత్రం స్థానిక కర్నూలు తాలుకా కార్యాలయంలో కర్నూలు డీఎస్పీ ఖాదర్‌బాషా ఈ హత్యోదంతం వివరాలను వెల్లడించారు. 
వివాహేతర సంబంధాలతో నేరాలకు పాల్పడి జైలుపాలై పిల్లలను అనాథలు చేయొద్దని డీఎస్పీ కోరారు.
Capture

Source EENADU
x

No comments:

Post a Comment

Post Top Ad