రోడ్డుప్రమాదంలో పెళ్లికొడుకు మృతి - Kurnool City

Breaking

Welcome to Kurnool City

Wednesday, 6 December 2017

రోడ్డుప్రమాదంలో పెళ్లికొడుకు మృతి


కొమరోలు, డిసెంబర్ 5: వివాహమై పదిరోజులు గడవకముందే పెళ్లికొడుకు రోడ్డుప్రమాదంలో మృతి చెందడంతో మండలంలోని గుంర్రెడ్డిపల్లి, కనిగిరి మండలం నందవనం గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మండలంలోని గుంర్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాశింపీరా తన మోటారుసైకిల్‌పై తాటిచర్లమోటు వైపు వెళ్తుండగా తాటిచర్లమోటు వైపు నుంచి ద్విచక్రవాహనంపై మరో ఇరువురు యువకులు వస్తున్నారు. రెండువాహనాలు సోమవారం రాత్రి గుంర్రెడ్డిపల్లి సమీపంలో ఢీకొన్నాయి. ఆ ప్రమాదంలో కాశింపీరా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. అతనికి కనిగిరి మండలం నందవనం గ్రామానికి చెందిన రమిజాబీతో వారంరోజుల క్రితం వివాహమైంది. దీనితో గుంర్రెడ్డిపల్లిలోని కాశింపీరా ఇంట్లో, నందవనం గ్రామంలోని రమిజాబీ ఇంట్లో పెళ్లి సంబరాలు ముగియకముందే కాశీంపీరా మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా రెండవ వాహనంపై వస్తున్న దర్గావలి, పీరావలిలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన దర్గావలిని గిద్దలూరు వైద్యుల సలహా మేరకు కర్నూలు వైద్యశాలకు తరలించారు. పీరావలి గిద్దలూరు వైద్యశాలలో చికిత్సలు పొందుతున్నారు. సమాచారం అందుకున్న గిద్దలూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here