అరుంధతిసినిమా కోట - Kurnool City

Breaking

Welcome to Kurnool City

Monday, 11 December 2017

అరుంధతిసినిమా కోట

#గద్వాల కోట(అరుంధతిసినిమా కోట)గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు*....
ఈ కోటకు ఉన్న మరో విశేషం బాలీవుడ్ ప్రముఖ హీరో ఐన అమీరఖాన్ భార్యా కిరణ్ రావు అలియాస్ జనంపల్లి కిరణ్ రెడ్డి మరియు బాలీవుడ్ హీరోయిన్ ఐన అదితి హైద్రి(కిరణ్ రెడ్డి cousion sister)ఈ గద్వాల రాజవంస్థురాలే*...
గద్వల సంస్థానం తుంగబద్ర మరియు కృష్ణా నదుల మద్య ప్రాంతములో నడిగడ్డగా పిలువబడే అంతర్వేదిలో 800 చ.కి.మీల మేర విస్తరించి ఉండేది. 14వ శతాబ్దములో కాకతీయ సామ్రాజ్య పతనము తర్వాత ఈ గద్వాల సంస్థానాధీశులు బహుమనీ సామ్రాజ్యము యొక్క సామంతులు అయినారు. వంశ చరిత్ర ప్రకారము గద్వాలను 1553 నుండి 1704 వరకు పెద్ద వీరారెడ్డి, పెద్దన్న భూపాలుడు, సర్గారెడ్డి, వీరారెడ్డి మరియు కుమార వీరారెడ్డి పరిపాలించారు.
1650 ప్రాంతములో ముష్టిపల్లి వీరారెడ్డి అయిజా, ధరూర్ మొదలైన మహళ్లకు నాడగౌడుగా ఉండేవాడు. వీరారెడ్డికి మగ సంతానము లేకపోయడము వలన తన ఏకైక కుమార్తెకు వివాహము చేసి అల్లుడు పెద్దారెడ్డిని ఇల్లరికము తెచ్చుకున్నాడు. వీరారెడ్డి తరువాత అల్లుడు పెద్దారెడ్డి నాడగౌడు అయినాడు. పెద్దారెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు ఆనందగిరి, చిన్నవాడు సోమగిరి (ఈయననే సోమానాధ్రి, సోమన్నభూపాలుడని ప్రసిద్ధుడయ్యాడు). పెద్దారెడ్డి తరువాత ఆయన రెండవ కొడుకు సోమన్న 1704 నుండి నాడగౌడికము చేశాడు. ఈయనే కృష్ణా నది తీరాన గద్వాల కోట నిర్మించి తుంగభద్రకు దక్షిణమున రాజ్యాన్ని బనగానపల్లె, ఆదోని, సిరివెళ్ల, నంద్యాల, సిద్ధాపురం, ఆత్మకూరు, అహోబిళం, కర్నూలు మొదలైన ప్రాంతాలకు విస్తరింపజేశాడు. ఈ సంస్థానము కింద 103 పెద్ద గ్రామాలు, 26 జాగీరులు ఉండేవి.
సోమనాద్రి
నిజాం అలీ ఖాన్ అసఫ్ ఝా II యొక్క పరిపాలనా కాలములో, దక్కనులోని కొన్ని ప్రాంతములలో మరాఠుల ప్రాబల్యము పెరిగి 25 శాతము ఆదాయ పన్ను (చౌత్) వసూలు చేయడము ప్రారంభించారు. దీనిని దో-అమలీ (రెండు ప్రభుత్వాలు) అని కూడా అనేవారు. రాజా సీతారాం భూపాల్ 1840 లో మరణించాడు. ఆ తరువాత ఆయన దత్తపుత్రుడు రాజా సీతారాం భూపాల్ II సంస్థానమును పరిపాలించాడు. నిజాము VII ఈయనకు "మహారాజ" అనే పట్టమును ప్రధానము చేశాడు. 1924 లో మరణించే సమయానికి ఈయనకు భార్య మరియు ఇద్దరు కుమార్తెలు కలరు.
గద్వాల సంస్థానాధీశులు తమ స్వంత నాణేలను ముద్రించుకున్నారు కూడా. 1909 నాటికి కూడా ఈ నాణేలు రాయిచూరు ప్రాంతంలో చలామణీలో ఉండేవి. [1]
నిడ్జూర్ యుద్ధం సవరించు
ఢిల్లీ పీఠంపై బహద్దూర్షా బలహీన పాలనసాగుతున్న కాలంలో దక్షిణ సుభేదార్ నిజాం ఉల్ ముల్క్ హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నారు. అయితే హైదరాబాద్ సంస్థానంలో అంతర్భాగంగా ఉన్న గద్వాల సంస్థానాధీశుడు సోమనాద్రి మాత్రం బహద్దూర్ షా కు అనుయాయిగానే పాలన కొనసాగించారు. ఇది సహించని నిజాం తన సేనాని అయిన దిలీప్ భానుడిని ఉసిగొల్పి గద్వాల సంస్థానంపై దండయాత్రకు పంపించాడట. దిలీప్ భానుడి సేన, సోమనాద్రి సేనలు కర్నూలు సమీపంలోని నిడ్జూర్ దగ్గర భీకరంగా తలపడ్డాయి. చివరికి ఈ యుద్ధంలో సోమనాద్రి వీరమరణం పొందగా , సోమన పెద్ద భార్య రాణి లింగమ్మ నిజాంతో సంధి కుదుర్చుకుని పాలన కొనసాగించింది)[2].
సాహితీపోషణ సవరించు
నిజాంరాష్ట్రంలోని సంస్థానాలలోకెల్లా గద్వాల సంస్థానంలో సాహితీపోషణ అధికంగా ఉండేది,[3] సంస్థానాధీశులు విద్యావేత్తలకు, కళాకారులను ఆదరించారు. సంస్థానంలో ప్రతి సంవత్సరం మాఘ, కార్తీక మాసాలలో సంగీత, సాహిత్య సభలు జరిగేవి. రాజాపెదసోమభూపాలుడు స్వయముగా కవి. ఆయన జయదేవుని గీతాగోవిందాన్ని తెలుగులోకి అనువదించాడు. 1761 నుండి 1794 వరకు పాలించిన చినసోమభూపాలుడు కవిపండితులను ఆదరించడమే కాకుండమే కాకుండా స్వయంగా రచనలుచేశాడు. ఇతని ఆస్థానంలో అష్టదిగ్గజములనే 8 మంది కవులు ఉండేవారు. ఇతని కాలాన్ని గద్వాల సంస్థానంలో ' సాహిత్య స్వర్ణయుగం ' గా చెబుతారు. ప్రముఖకవి సోమయాజులు, అలంకార శిరోభూషణం రచించిన కందాళాచార్యులు ఇక్కడివారే. ఆంధ్రదేశంలోని ఎక్కడెక్కడి కవులో ఇక్కడి రాజుల దర్శనానికి వచ్చేవారు.
తిరుపతి వేంకటకవుల ఉదంతం
ఆంధ్రదేశంలో తిరుపతి వేంకటకవులు తిరుగని ప్రదేశం లేదు. వారికున్న ప్రశస్తే వేరు. అలాంటి ప్రముఖ కవులకు కూడా గద్వాల సంస్థానపు రాజుల దర్శనం అంత సులభంగా దొరకలేదనటానికి ఓ ఉదాహరణ ఈ సంఘటన. ఒక రోజు తిరుపతి వెంకటకవులు గద్వాల సంస్థానానికి వచ్చారు. రాజ దర్శనం కాలేదు. ఒకటి, రెండు రోజులు గడిచిపోయింది. అయినా దర్శన భాగ్యం కాలేదు. పట్టువదలని కవులు పట్టణాన్ని వదలకుండా వండుక తిని ఎదురు చూశారు. అయినా రాజదర్శనం కాలేదు. ఇక విసుగొచ్చిన కవులు ఒక రోజు " చర్ల బ్రహ్మయ్య శాస్త్రి శబ్ధ శాస్త్రం చెప్ప / వంట నేర్పించే గద్వాల రాజు " అని ఓ కాగితం మీద రాసి రాజా వారికి పంపించారట. దానితో జరిగిన తప్పిదాన్ని తెలుసుకున్న రాజా వారు వెంటనే కవులను రప్పించి, వారి పాండిత్య ప్రదర్శనకు కావలసిన ఏర్పాట్లు చేయించి, తదనంతరం ఘనంగా సత్కరించి, సంభావనలు అందజేశారట.
ఈ తిరుపతి వెంకటకవులే ఒకనాడు విజయనగర రాజుల దర్శనార్థం వెళ్ళినప్పుడు, అక్కడి దివాను కోదండరామారావు సాహిత్య సభకు కాకుండా. సన్మానానికి ఏర్పాటు చేయగా కోపమొచ్చిన తిరుపతి కవులు అతనిని ఉద్దేశించి...
అటు గద్వాలిటు చెన్నపట్టణము మధ్యంగల్గు దేశమ్మునన్
జటుల స్ఫూర్తి శతావధానములు మెచ్చం జేసియున్నట్టి మా
కిటు రాజీయక యున్న దర్శనము నింకెవ్వానికీ రాజొసం
గుట? చెప్పంగదవయ్య పాలితబుధా! కోదండరామాభిధా![4]. అంటూ చెప్పిన పద్యంలో.... సాహిత్యానికి గద్వాల ఒక గొప్ప స్థానమన్న

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here